కరోనాతో సీనియర్ నటి భర్త మృతి

Published on Apr 27, 2021 1:31 pm IST

సీనియర్ నటి మాలా శ్రీ భర్త, నిర్మాత కొణిగల్ రాము కన్నుమూశారు. గత వారం కరోనా సోకడంతో ఆయన్ను బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ నిన్న సోమవారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. కొణిగల్‌ రాము కన్నడ సినీ ఇండస్ర్టీలో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు తీశారు. ఏకే 47, లాకప్‌ డెత్‌, సీబీఐ లాంటి సినిమాలను నిర్మించారు ఆయన. హెవీ బడ్జెట్ సినిమాల నిర్మాతగా ఆయనకు మంచి పేరుంది.

మాలా శ్రీ ఒకప్పుడు కన్నడలో స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగింది. 90, 2000 ల దశకంలో స్టార్ హీరోల సరసన నటించారు ఆమె. తెలుగులో కూడ ‘బావా బావమరిది, భలే మావయ్య, అల్లరి పోలీస్ లాంటి హిట్ సినిమాలు చేశారామె. తెలుగునాట విజయశాంతి ఎలాగో కన్నడలో మాలా శ్రీ అలా అనేవారు అప్పట్లో. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొణిగల్‌ రాము మృతిపై కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :