ఇంటర్వ్యూ : మాళవిక నాయర్ – ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ ఒత్తిడిలో ఉన్నాడు.

Published on Jul 7, 2018 3:24 pm IST

మీ పట్ల టాలీవుడ్ ఎలా వ్యవహరిస్తుంది ?

ఇప్పటివరకైతే ప్రతి ఒక్కరూ చాలా మర్యాదగా , ప్రోత్సాహకరంగా ఉన్నారు. నేను ఇక్కడ మంచి ఆఫర్లు పొందుతున్నాను, నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక నా కెరీర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాను.

విజేత సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

నేను ఈ చిత్రంలో మధ్య తరగతి అమ్మాయి పాత్ర లో నటించాను . నా జీవితం పట్ల బాధ్యత గా ఉంటాను. ఇది కంప్లీట్ గా హీరో పాత్రకు వ్యతిరేకంగా ఉండనుంది.

మీరు మహానటిలో చిన్న పాత్రను ఎన్నుకోవడానికి గల కారణం ?

కేవలం నాగ్ అశ్విన్ గారి మీద వున్నా అభిమానం తోనే ఆ పాత్రను చేయడానికి ఒప్పుకున్నాను. ఎవడే సుబ్రహ్మణ్యం చేస్తున్న సమయంలో నాగ్ తో మంచి స్నేహం కుదిరింది. దాంతో పాటు సావిత్రి గారి బయోపిక్ లో నేను ఒక భాగం కావాలనే ఈ చిత్రంలో నటించాను. చిత్రం యొక్క నిడివి కొంచెం ఎక్కువగా ఉండటంతో, నా సన్నివేశాలను తొలగించవలసి వచ్చింది.

కళ్యాణ్ దేవ్ తో నటించడం ఎలా ఉంది ?

కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉంటాడు . అతను చేసే పని విషయంలో చాలా క్లారిటీ గా ఎప్పుడు పని మీదనే దృష్టి పెడతాడు. ఇప్పుడు అతని మీద ఒత్తిడి ఉంది . ఆయన మొదటి చిత్రం విజయం సాధించడం కోసం చాలా కష్టపడుతున్నాడు.

ప్రస్తుతం ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నారు ?

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న టాక్సీవాలా చిత్రంతో పాటు ఒక తమిళ చిత్రం లో కూడా చేస్తున్నాను . ఇక తండ్రి కొడుకుల కథ తో తెరకెక్కుతున్నవిజేత చిత్రం అందరికి కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను.

సంబంధిత సమాచారం :