ఎడారిలో ఆకలితో అల్లాడిపోతున్న హీరో

Published on Apr 4, 2020 2:22 pm IST

కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రవాణా వ్యవస్థ స్తంభించి పోవడంతో ఎక్కడివారు అక్కడే ఇరుక్కుపోయారు. ఇతర దేశాల ప్రజలు కొరోనా బంద్ కారణంగా పలుదేశాలలో ఇరుక్కుపోయి ఆకలిబాధలు అనుభవిస్తున్నారు. కాగ్ ఓ మలయాళ చిత్ర యూనిట్ జోర్డాన్ దేశం షూటింగ్ కొరకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. కరోనా లాక్ డౌన్ కి ముందు వీరు ఓ చిత్ర షూటింగ్ కొరకు జోర్డాన్ ఎడారి ప్రాంతానికి వెళ్లడం జరిగింది.

వీరిలో మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా వారికి కనీసం తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది. తిండి నీళ్లు లేక అల్లాడిపోతున్న వారిని స్వదేశం రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. ముందుగానే ఈ టీమ్ ని వెళ్లడం శ్రేయస్కరం కాదని వారించారట. పృథ్వి రాజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బెస్లీ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం మంచు విష్ణు తన పిల్లలు అమెరికాలో ఇరుక్కుపోయారని చెప్పి బాధపడిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More