వెంకీ సినిమాకి మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

వెంకీ సినిమాకి మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

Published on Jul 30, 2015 3:48 PM IST

Venkatseh
‘గోపాల గోపాల’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ తన తదుపరి సినిమాని ఆగష్టు నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. వెంకటేష్ సరసన నయనతార జోడీ కట్టనున్న ఈ సినిమాకి ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు ఫేం క్రనతి మాధవ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాని డి. సురేష్ బాబు – పరుచూరి ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ఆగష్టులో సినిమాని స్టార్ట్ చేసి శరవేగంగా షూట్ ని పూర్తి చేసి డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ సినిమాకి కావాల్సిన టెక్నికల్ టీంని కూడా ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మలయాళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసారు. క్రాంతి మాధవ్ గత సినిమా మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు’కి కూడా తనే మ్యూజిక్ అందించాడు. ఇది కాకుండా నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’, నాగార్జున – కార్తీ సినిమాలకి కూడా గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వారలోనే గోపి సుందర్ ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొననున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు