
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో చేస్తున్న మరో సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా అయిపోగానే నాగ చైతన్య మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమమ్’ రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమాని నవంబర్ 30వ తేదీన లాంచ్ చేసి, డిసెంబర్ మొదటి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. కార్తికేయ ఫేం చందూ మొండేటి ఈ రీమేక్ కి దర్శకత్వం వహించనున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఒరిజినల్ వెర్షన్ కి మ్యూజిక్ అందించిన రాజేష్ మురుగేషన్ ని తెలుగు వెర్షన్ కి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే రాజేష్ ని కూడా అప్రోచ్ అయ్యారు. తను ఇంకా తెలుగు వెర్షన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం డైరెక్టర్ రాజేష్ తో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది. ముగ్గురు హీరోయిన్స్ కి అవకాశం ఉన్న ఈ సినిమాలో ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ ని సెలక్ట్ చేసారు. మిగిలిన ఇద్దరినీ సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు.

