ఆ చిత్రాన్ని తంబీలు తిడితే మలేషియా మంత్రి పొగిడారు.

ఆ చిత్రాన్ని తంబీలు తిడితే మలేషియా మంత్రి పొగిడారు.

Published on Sep 4, 2019 1:15 AM IST

నటి జ్యోతిక ఇటీవల నటించిన “రాత్ససి” చిత్రంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ విధ్యావ్యవస్థ, ఉపాధ్యాయుల పనితీరుని ఉద్దేశిస్తూ విమర్శనాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్కడి ఉపాధ్యాయ సంఘాలు ప్రదర్శన కాకుండా ఆపివేశాయి. ఆ చిత్రానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఉద్యమమే లేవదీశారు. ఎట్టకేలకు ఆ మూవీ ప్రదర్శన తమిళనాడులో ఆగిపోవడం జరిగింది. రాత్ససి చిత్ర ప్రదర్శనను అడ్డుకోవడంపై హీరో సూర్య తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది.

కాగా ఇక్కడ విమర్శలు పాలైన ఈ చిత్రం మలేసియా విద్యా శాఖా మంత్రి చేత ప్రశంసలు అందుకుంది. తల్లితండ్రులు, విద్యార్థులు ఖచ్చితంగా చూడవలసిన చిత్రంగా దీనిని వర్ణించారు ఆయన. ఉన్నత పదవిలో ఉన్న ఒక విదేశీ మంత్రి మనసు గెలుచుకోవడమంటే గొప్ప విషయమే అనాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు