కాస్టింగ్ కౌచ్ నివారణకు డేరింగ్ స్టెప్ తీసుకున్న దర్శకుడు

Published on Jun 18, 2019 7:02 am IST

ఈమధ్య భాషా బేధం లేకుండా ప్రతి సినీ పరిశ్రమలోనూ గతంలో చోటు చేసుకున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు అనేకం బయటికి వచ్చాయి. తెలుగులో సైతం కొందరు వ్యక్తులు ఈ ఆరోపణల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకానొక దశలో ఇండస్ట్రీలో ఆడవారికి పెద్దగా రక్షణ లేదని తేటతెల్లమైంది. దీంతో మల్లేశం’ చిత్ర దర్శకుడు, నిర్మాత రాజ్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకుని తన సినిమా విషయంలో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడ్డారు.

సినిమా ఆరంభానికి ముందే ఆయన యూనిట్ సభ్యుల్లో కానీ, నటీనటుల్లో కానీ ఎవరైనా సరే లైంగిక వేధింపుల ఆరోపణల్ని ఎదుర్కొంటే వారు తక్షణమే ప్రాజెక్ట్ నుండి బయటకి వెళ్లిపోవాలని దాంతో పాటే వారు వైదొలగడం మూలాన కలిగే నష్టాన్ని సైతం భర్తీ చేయవలసి ఉంటుదని ఖచ్చితంగా చెప్పి కాంట్రాక్ట్ చేయించుకున్నారట. నిజంగా కాస్టింగ్ కౌచ్ నివారణకు నిర్మాతలు, దర్శకుల వైపు నుండి ఇదొక మంచి చర్యే అనొచ్చు. ఈయన నిర్ణయాన్ని పరిశ్రమలోని పలువురు అభినందిస్తున్నారు. ఇకపోతే ‘మల్లేశం’ చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More