విడుదలకు ముందే యూట్యూబ్‌లో సినిమా సీన్లు

Published on Jun 19, 2019 6:59 am IST

సినిమా ఫైనల్ ఔట్ ఫుట్, రా కంటెంట్ మధ్యన చాలా వ్యత్యాసం ఉంటుంది. రా సీన్స్ ఒకసారి ఎడిటింగ్ టేబుల్ మీదికి వెళితే షూటింగ్ సమయంలో ముఖ్యమైనవి, బాగా వచ్చినవి అనుకున్న సీన్లు సైతం ఎగిరిపోతుంటాయి. అవి ఎంత బాగున్నా చిత్రాన్ని దోహదపడవు కాబట్టి కొన్నింటిని తొలగిస్తుంటారు. అలా తొలగించిన వాటిని నిర్మాతలు, పిఆర్ టీమ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసి ప్రమోషన్లకు వాడుకుంటుంటారు.

అయితే ఇన్నాళ్లు సినిమా విడుదలైన తరవాత మాత్రమే వాటిని బయటికి వదిలేవారు. ఎందుకంటే ప్రధాన పాత్రలు, చిత్ర నేపథ్యం లాంటివి లీక్ కాకూడదని. కానీ ‘మల్లేశం’ చిత్ర నిర్మాతలు మాత్రం సినిమా నుండి తొలగించిన సీన్లను చిత్రం రిలీజ్ కావడానికంటే ముందే బయటికి వదిలేశారు. వాటిని చూస్తే బాగానే ఉంది కదా ఎందుకు తొలగించారు.. బహుశా సినిమాలో ఇంతకంటే మంచి సీన్లు ఉంటాయేమో అనే ఆలోచన కలుగుతోంది. రాజ్ ఆర్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమా జూన్ 21న విడుదలకానుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై పరిశ్రమలో ఇప్పటికే పాజిటివ్ టాక్ నడుస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More