‘మళ్ళీ మళ్ళీ చూశా’ ఒక ఫుల్ మీల్స్‌లా ఉంటుంది – హీరో అనురాగ్‌ కొణిదెన

‘మళ్ళీ మళ్ళీ చూశా’ ఒక ఫుల్ మీల్స్‌లా ఉంటుంది – హీరో అనురాగ్‌ కొణిదెన

Published on Oct 15, 2019 8:45 PM IST

క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ”మళ్ళీ మళ్ళీ చూశా”. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌కి శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌ 18న తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్స్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్బంగా హీరో అనురాగ్‌ కొణిదెన మీడియాతో మాట్లాడారు. అనురాగ్‌ మాట్లాడుతూ.. ‘నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌. మా నాన్న గారు కోటేశ్వరరావు ‘క్రిషి కన్‌స్ట్రక్షన్స్‌ ప్రై.లి మేనేజింగ్‌ డైరెక్టర్‌. ఈ సినిమా నిర్మాత. సినిమాలోకి రావడానికి కారణం.. నిజానికి నాకు కన్‌స్ట్రక్షన్‌ రంగం, సినిమా రంగం రెండు ఇష్టమే.. అయితే నా చదువు అయిపోయాక మా నాన్న గారి వ్యాపారం చూసుకునే వాడిని. కానీ యాక్టింగ్‌ మీద నాకున్న ఫ్యాషనే నన్ను ఈ రంగం వైపు వచ్చేలా చేసింది.

ఇక ఈ సినిమాలో నా క్యారెక్టర్‌లో రెండు వేరియేషన్స్‌ ఉంటాయి. కాలేజ్‌ కుర్రాడిలా సెట్టిల్డ్‌ క్యారెక్టర్‌ ఒకటి. మరొకటి కెరీర్‌ గురించి ఎలాంటి ఆలోచన లేకుండా తిరిగే మాస్‌ క్యారెక్టర్‌. కెరీర్ మీద ఆలోచన లేని అతను మళ్లీ కాలేజ్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. అనేది సినిమాలో మెయిన్‌ పాయింట్‌. నా వరకూ నటుడిగా నవరసాలు చేయడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. నేను చిన్నపటినుండి వెంకటేష్‌ గారి సినిమాలు ఎక్కువగా చూసే వాడిని. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నా ఇన్స్పిరేషన్‌. ఇక నానా నెక్స్ట్‌ మూవీకి కొన్ని కథలు విన్నాను. ఒక థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు