మాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి ఇప్పుడు ఎలాంటి చిత్రాలు ఎంచుకుంటూ వెళ్తున్నారో చూస్తున్నాం. సాలిడ్ కంటెంట్ తో ఎప్పటికప్పుడు ఆసక్తికర ట్రీట్ ని ఇస్తున్న మమ్ముట్టి నుంచి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అందులోని ప్రత్యేకంగా హారర్ – థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి నిర్మాత చక్రవర్తి రామచంద్ర స్థాపించిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ కాంబినేషన్లో మమ్ముట్టి భారీ చిత్రం “భ్రమయుగం”.
ఈరోజు (ఆగస్టు 17న) అనౌన్స్ చేశారు. అలాగే నైట్ షిఫ్ట్ స్టూడియోస్ వారికి ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ కాగా దీనిని ప్రతిష్టాత్మకంగా అయితే అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కిస్తుండగా..ఈ చిత్రం లాంచ్ కార్యక్రమంలో అయితే చిత్ర యూనిట్ సహా ముఖ్యులు పాల్గొన్నారు.
చిత్ర ప్రకటన సందర్భంగా ప్రముఖ నటుడు మమ్ముట్టి మాట్లాడుతూ.. “#NS1 ఒక ఉత్తేజకరమైన చిత్రం. నేను మునుపెన్నడూ పోషించని పాత్రను పోషిస్తున్నందున ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దర్శకుడు రాహుల్ అద్భుత ప్రతిభ, నిర్మాతలు రామ్-శశిల అభిరుచి ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకం చేశాయి.” అన్నారు.
అలాగే ఈ చిత్రం రచయిత, దర్శకుడు రాహుల్ సదాశివన్ మాట్లాడుతూ.. “మమ్ము ట్టి గారి సినిమాకి దర్శకత్వం వహించాలనే కలను సాకారం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ‘భ్రమయుగం’ అనేది కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగేకథ. దీనిని అద్భు తంగా మలచడానికి నిర్మా తల సహకారం లభించినందుకు సంతోషిస్తున్నా ను. పప్రంచ వ్యాప్తంగా ఉన్న మమ్ముక్కా అభిమానులకు మరియు ఈ జానర్ ని ఇష్టపడేవారికి ఇది ఒక ట్రీట్ అవుతుందని ఆశిస్తున్నాను.” అని అన్నా రు.
ఇక నైట్ షిఫ్ట్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు, నిర్మాత చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ.. ” హారర్ జానర్‌పై నాకున్న అభిరుచి, రిచ్ కంటెంట్ మరియు ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్‌లతో సంవత్సరాల తరబడి పనిచేసిన అనుభవం, ప్రపంచస్థాయి చిత్రాలను రూపొందించాలనే తపనతో ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.” అన్నారు.
అలాగే నిర్మాతలు చక్రవర్తి రామచంద,ఎస్. శశికాంత్ మాట్లాడుతూ.. “మా సంస్థలో మొదటిసినిమానే లెజెండరీ నటుడు మమ్ము క్కా (మమ్ముట్టి)తో చేసేఅవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా ము. మమ్ము క్కా యొక్క అసమానమైన ఇమేజ్ తో ఈ చిత్రం మరో స్థాయికి వెళ్తుంది.‘ భ్రమయుగం’’ అనేది ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి మా దర్శకుడు రాహుల్ సృష్టించిన అద్భు త పప్రంచం” అని అన్నా రు.
ఇక ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్ ఇతర ముఖ్య పాతల్రు చేస్తుండగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్ గా జోతిష్ శంకర్, ఎడిటర్గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్రి్టో జేవియర్ లు వ్యవహరిస్తున్నారు. టిడిరామకృష్ణన్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి మేకప్ రోనెక్స్ జేవియర్, కాస్ట్యూ మ్స్ మెల్వీ జె. అందిస్తున్నారు.
నైట్ షిఫ్ట్ స్టూ డియోస్, వైనాట్ స్టూ డియోస్ సమర్పిస్తున్న ‘ భ్రమయుగం’ 2024 ప్రారంభంలో పప్రంచవ్యా ప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీభాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.




