స్టార్ హీరో యుద్ధవీరుడి లుక్ అదిరిందిగా…!

Published on Jun 8, 2019 11:47 am IST

మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి హీరో గా తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం”మమాంగం”. నేడు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. కత్తి,డాలు చేతపట్టి రణభూమిలో భారీగా మోహరించిన సేనల మధ్య శత్రువులను చంపడానికి దూసుకెళుతున్న మమ్ముట్టి ఫొటో మూవీ పై అంచనాలు పెరిగేలా చేస్తుంది. అదే ఫొటోలో ఓ పదేళ్ల బాలుడు కూడా యుద్దానికి సన్నద్ధుడై శత్రువులపై దాడి చేయడం ఆసక్తి రేపుతుంది.

17 వ శతాబ్దపు కాలంనాటి ‘మమాంకం’ అనే ఓ పండుగ చుట్టూ ఈ కథ నడుస్తుందని సమాచారం. ఈ పండుగ విషయంలో ఇద్దరు వీరుల మధ్య తలెత్తే వివాదాలు, దాని తాలూకు యుద్ధాల సమాహారమే ఈ మూవీ అని తెలుస్తుంది. ఈ మూవీని తెలుగు,హిందీ తమిళ, మలయాళ భాషలలో భారీ ఎత్తున్న విడుదల చేయనున్నారు. మొదటి షెడ్యూలు సంజీవ్ పిళ్ళై దర్శకత్వం వహించగా, కొన్ని కారణాలతో ఆయనకు బదులుగా దర్శకత్వ బాధ్యతలు ఎం. పద్మకుమార్ తీసుకున్నారు. కావ్య మూవీస్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More