బాలీవుడ్ లోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్!

బాలీవుడ్ లోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్!

Published on Aug 14, 2025 2:00 PM IST

war2 jrntr

లేటెస్ట్ గా పాన్ ఇండియా ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన అవైటెడ్ చిత్రాల్లో వార్ 2 కూడా ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి ప్లాన్ చేసిన స్పై యూనివర్స్ లో భాగమైన సినిమా ఇది కాగా ఈసారి ఇన్స్టాల్మెంట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంట్రీ కూడా ఉండడంతో మరింత ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది.

ఈ సినిమా తోనే తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా తన ఎంట్రీ మాత్రం బాలీవుడ్ లో అదిరింది అని చెప్పాలి. తన స్టార్డం ని మేకర్స్ బాగా దృష్టిలో పెట్టుకున్నట్టు ఉన్నారు. అందుకే అంతకు మించి తారక్ ని ప్రెజెంట్ చేశారు. తనపై ఎలివేషన్స్ కానీ ఈవిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పవచ్చు.

తన ఎంట్రీ తోనే ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేశారు మేకర్స్. ఇలా క్లైమాక్స్ లో మంచి ఎమోషనల్ షేడ్ ని కూడా తారక్ పై చూపించడంతో అభిమానులు అంచనాలు దాదాపు రీచ్ అయ్యిపోయారనే చెప్పవచ్చు. సో మొత్తానికి మాత్రం తారక్ బాలీవుడ్ లోకి మంచి ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు