“మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu) సినిమా సంక్రాంతికి స్పెషల్ గా విడుదలైంది. నిన్న రాత్రి ప్రీమియర్‌లతో ఈ సినిమా రిలీజ్ అయింది. అన్ని వర్గాల నుంచి మంచి సానుకూల స్పందనను ఈ సినిమా అందుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి ప్రేక్షకులను అలరించే వినోదాత్మక చిత్రంతో మరోసారి విజయం సాధించారు. అన్నట్టు ఈ చిత్రం విదేశాల్లో కూడా మంచి ప్రభావాన్ని చూపించింది. ఈ సినిమా అమెరికాలో 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్ గ్రాస్ మార్కును దాటి మెగాస్టార్ కెరీర్ లోనే ఓ మైలురాయిని చేరుకుంది.
పైగా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ ఘనత సాధించిన చిరంజీవి రెండవ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. మొత్తానికి ఈ సినిమాలో చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మొత్తమ్మీద సంక్రాంతికి మెయిన్ స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.


