టాలీవుడ్‌లో సంక్రాంతి బరిలో పలు క్రేజీ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ అవైటెడ్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కావడం.. మెగాస్టార్ చిరంజీవి ఇందులో హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై హైప్ పెంచేసింది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారని.. ఇందులోని కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకులను అలరిస్తుందని.. ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ దొరకడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా విక్టరీ వెంకటేష్ ఓ క్యామియో రోల్‌లో నటిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.


