హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకరవర ప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu)సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు నమోదవుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి స్టైలిష్ లుక్, ఎనర్జిటిక్ డ్యాన్స్, టైమింగ్‌తో కూడిన కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ సినిమా తాజాగా నార్త్ అమెరికాలో మరో మైలురాయి దాటింది. నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమైంది. చిరు తనదైన టైమింగ్‌తో అదరగొట్టడంతో అభిమానులకు నిజమైన పండుగ వచ్చింది.
సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ట్రెండ్ చూస్తుంటే నార్త్ అమెరికా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా “మన శంకరవర ప్రసాద్ గారు” మెగాస్టార్ రేంజ్‌ను మరోసారి చాటుతూ, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని కొనసాగిస్తోంది.


