ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చి సెన్సేషనల్ యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు కూడా ఒకటి.
ప్రీమియర్ల తోనే బాక్స్ లు బద్దలుకొట్టిన మెగాస్టార్ డే 1 కి రికార్డ్ ఓపెనింగ్స్ కొల్లగొడుతుంది అని ట్రేడ్ వర్గాల్లో ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా ప్రీమియర్స్ ఇంకా డే 1 కి కలిపి ఏకాంగా 70కోట్లకి పైగా గ్రాస్ ని అందుకునే ఛాన్స్ ఉందని ఇప్పుడు ఒక అంచనా.. సో మన శంకర వర ప్రసాద్ గారు లెక్క ఊహించని నెంబర్ నుంచి మొదలవుతుంది అని చెప్పొచ్చు. ఇక దీనిపై మేకర్స్ అధికారికంగా ఎలాంటి నెంబర్ అందిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో వెంకీ మామ కూడా నటించగా క్యాథరిన్ తదితరులు నటించారు. అలాగే భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ వారు అలాగే గోల్డ్ బాక్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల నిర్మాణం వహించారు.
