మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana ShankaraVaraPrasad Garu) ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అది కూడా వీక్ డే లోనే అందుకుంది. కానీ పండుగ మూమెంట్ లో కూడా గట్టి ర్యాంపేజ్ చూపిస్తుంది అని అంతా భావించారు. మరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా భోగి రోజున సాలిడ్ పికప్ అందుకుంటుంది.
ఆల్రెడీ నిన్న 24 గంటల్లోనే ఏకంగా 4 లక్షల టికెట్ సేల్స్ ని బుక్ మై షోలో క్రాస్ చేసింది. ఇక ఇవాళ బుకింగ్స్ అయితే ఆల్రెడీ గంటకి 22 వేలకి పైగా టికెట్స్ వరకు తెగుతున్నాయి. ఇలా మన శంకర వరప్రసాద్ గారు పండుగ ర్యాంపేజ్ స్టార్ట్ చేసారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే షైన్ స్క్రీన్స్ వారు, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.


