నైజాంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి రోజు వసూళ్లు ఎంతంటే!

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా విక్టరీ వెంకటేష్ కామియో రోల్ లో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu). మంచి అంచనాలు నడుమ వచ్చి భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా నైజాం మార్కెట్ లో కూడా అదే రీతి స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ ని చేస్తుంది. మరి లేటెస్ట్ గా నిన్నటి నైజాం లెక్కలు బయటకి వచ్చాయి.

పి ఆర్ లెక్కల ప్రకారం సంక్రాంతి రోజున 5 కోట్లకి పైగా షేర్ ని రాబట్టింది అని తెలుస్తోంది. నిన్న ఒక్క రోజే ఈ సినిమా 5.5 కోట్ల షేర్ ని అందుకోగా మొత్తం 21 కోట్ల షేర్ ని టచ్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో మన శంకర వరప్రసాద్ గారు హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.

Exit mobile version