ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో వచ్చిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) కూడా ఒకటి. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డులు రీజనల్ గా తిరగేస్తుంది.
ఆల్రెడీ 3 రోజుల్లోనే 150 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. వసూళ్ల పరంగానే కాకుండా ఆన్లైన్ బుకింగ్స్ లో కూడా ఈ చిత్రమే అత్యధిక బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. ఉన్న అన్ని సినిమాల్లో కూడా మన శంకర వర ప్రసాద్ గారు డామినేషన్ ఎక్కువ కనిపిస్తుండగా దీని తర్వాత మాత్రం యువ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు నిలిచింది.
మెగాస్టార్ సినిమా గంటకి 30 వేలకి పైగా టికెట్స్ తెంపుతుంటే నవీన్ సినిమా మాత్రం 10 వేలకి పైగా తెంపుతుంది. ఇంత పోటీలో కూడా ఈ సినిమాకి ఇలాంటి రెస్పాన్స్ దక్కడం మామూలు విషయం కాదని చెప్పొచ్చు. ఇలా సంక్రాంతి బరిలో మాత్రం ఈ రెండు సినిమాలు టాప్ ఛాయిస్ గా నిలిచాయి.


