
‘కింగ్’ అక్కినేని నాగార్జున ‘మనం’ ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన షేర్ 25 కోట్ల మార్కుని చేరుకుంటుంది. రెండో వారం కూడా అన్ని ఏరియాలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రం పాలుపంచుకున్న వారందరికి మంచి లాభం తెచ్చిపెడుతుంది.
నిజాం లో ఏడు కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ లో ఆరు కోట్ల మార్కును దాటనుంది. ఇటీవల కాలంలో అక్కినేని కుటుంబం సాధించిన అతి పెద్ద విజయం ‘మనం’. ఈ సినిమా సాధించిన విజయానికి నాగార్జున చాలా సంతోషంగా వున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ ఇంటరెస్టింగ్ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందించారు.

