మార్చి చివర్లో రానున్న ‘మనం’

Published on Dec 13, 2013 8:30 am IST

Manam
అక్కినేని ఫ్యామిలీ హీరోలయిన ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘మనం’. ఈ సినిమా మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది. ఈ నెల 21 వరకూ మైసూర్ లోనే షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ తో 90% షూటింగ్ పూర్తవతుంది. ఇప్పటికే ఏఎన్ఆర్ పార్ట్ కి సంబందించిన షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

మనం సినిమాలో సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా కథ సాగితుందని సమాచారం.

సంబంధిత సమాచారం :