మంచు హీరో సినిమా విడుదల వాయిదా !

1st, April 2018 - 10:15:36 AM

మంచు విష్ణు హీరోగా, జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచరి అమెరికా యాత్ర’ పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రుపొందించబడిన ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ కాగా ఇందులో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏం.ఎల్.కుమార్ చౌదరి సమర్పణలో కీర్తి చౌదరి, కిట్టు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6 న విడుదల చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. కాని తాజా సమాచారం మేరకు ఆచరి అమెరికా యాత్ర ఏప్రిల్ 27 న విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి ఈ సినిమాకు మాటలు రాయగా విక్రమ్ రాజు స్క్రీన్ ప్లే అందించారు. సెన్సార్ నుండి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.