మంచు లక్ష్మీకి మరో అరుదైన గౌరవం !

Published on Jun 27, 2021 2:01 am IST

నటి మరియు నిర్మాత మంచు లక్ష్మీప్రసన్నకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రం నుంచి ఆమెకు ఈ గౌరవం దక్కడం విశేషం, ఇంతకీ మంచు లక్ష్మిని ఎందుకు అభినందించారు అంటే.. ఆమె పలు సామాజిక సేవలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఇండియానా గవర్నర్‌ ఎరిక్‌ హోల్‌కోమ్‌ అభినందనలతోపాటు ఇండియానా రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించిన స్కార్ఫ్‌ను కూడా బహకరించారు.

మంచు లక్ష్మీ చేస్తున్న సేవలను గుర్తించి ఈ సన్మానం చేశామని సీనియర్‌ అడ్వైజర్‌ ఆఫ్‌ ఇండియానా చింతల రాజు తెలిపారు. ఇక తనకు ఇలాంటి విలువైన అరుదైన గౌరవం దక్కడం పట్ల మంచు లక్ష్మీప్రసన్న సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక కరోనా సోకి వైద్యం కోసం సిటీకి వచ్చి ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాంటి వారికీ కూడా సాయాన్ని అందిస్తూ లక్ష్మి తన పెద్ద మనసును చాటుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :