బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్న ‘వైఫ్ అఫ్ రామ్’ !

Published on Jul 22, 2018 10:00 am IST

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు విజయ్ తెరకెక్కించిన చిత్రం ‘వైఫ్ అఫ్ రామ్’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది దాంతో చిత్రాన్ని ఎలాగైనా ప్రేక్షకులకు చేరవేయాలని నటి మంచు లక్ష్మి బిగ్ బాస్ 2 ను ఆశ్రయించింది. ఆమె హౌస్ లోని మిగతా పార్టిసిపెంట్స్ తో కలిసి సందడి చేయనుంది. ఈ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కానుంది.

చిన్న పెద్ద సినిమాలు అని తేడాలేకుండా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ మీద ఆధారపడడం ఇదేమీ కొత్త కాదు ఇంతకు ముందు పెద్ద పెద్ద నటులు కూడా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ హౌస్ లో మెరిశారు.
ఇక మొదటిసారి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ 2 మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. షో ప్రారంభంలో షో ఫై పెదవి విరిచిన తరువాత పుంజుకొని బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :