మనోజ్ : నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా

Published on Dec 6, 2019 1:10 pm IST

వెటర్నిటీ డాక్టర్ మీద అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్రా సంతోషం వ్యక్తం తెలుపుతున్నారు. హీరో మంచు మనోజ్ అయితే ఎన్‌కౌంటర్‌ గురించి మాట్లాడుతూ విపరీతమైన భావోద్వేగానికి గురయ్యాడు. ఆరంభం నుండి ఈ ఘోరాన్ని ఖండిస్తూ వచ్చిన మనోజ్ రెండు రోజుల క్రితమే దిశ కుటుంభ సభ్యులను కలిసి ధైర్యం కూడా చెప్పారు.

అలాగే ఈ ఘటనలో భాదితురాలికి న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ వచ్చిన మనోజ్ ఎన్‌కౌంటర్‌ గురించి మాట్లాడుతూ ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది, ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది, ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది, నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్ ఉందా.. ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా అంటూ ఎమోషనల్ అయ్యారు.

సంబంధిత సమాచారం :

X
More