‘ఎన్టీఆర్’ని కొట్టిన వాడి చెయ్యి విరగ్గొట్టిన మంచు మనోజ్ !

Published on Sep 27, 2018 3:40 am IST

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోల్లో.. మంచు మనోజ్ పేరే ముందు చెప్పుకోవాలి. బాగా యాక్టివ్ గా తన అభిమానులు పెట్టిన ట్వీట్ లకు, రీట్వీట్ లు పెడుతుంటాడు ఆయన. అయితే కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు పెట్టినా, ఎప్పుడో జరిగిన వాటి గురించి అడిగినా.. ఏమాత్రం విసుగు లేకుండా.. మనోజ్ సరదాగా సమాధానమిస్తున్నాడు.

కాగా, తాజాగా ట్వీటర్ లో ఓ అభిమాని మనోజ్ ని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఎవరో ఒకతను కొట్టారట. దానికి మనోజ్ వెళ్లి.. ఎన్టీఆర్ పై చెయ్యి ఎత్తిన వాడి చెయ్యి విరగ్గొట్టాడట. చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి చెప్పమని ఓ అభిమాని మనోజ్ ని కోరాడు. దాంతో మనోజ్ ఆ అభిమానికి సమాధానంగా నవ్వుతూ.. ‘తారక్‌నే అడుగు. ఈ విషయం గురించి నాకంటే తనే బాగా చెప్తాడు’ అని పోస్ట్ చేశాడు. ఏమైనా మనోజ్, ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ కోసం.. చిన్నప్పుడే ఫైట్ చెయ్యడం గొప్ప విషయం.

సంబంధిత సమాచారం :