దసరా కి మరో ప్రకటన చేయనున్న హీరో మంచు మనోజ్!

Published on Aug 22, 2021 11:51 pm IST

గత కొద్ది సంవత్సరాలుగా హీరో మంచు మనోజ్ చాలా తక్కువ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా మనోజ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాక మంచు మనోజ్ నటిస్తున్న అహం బ్రహ్మాస్మి చిత్రం షూటింగ్ ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే హీరో మంచు మనోజ్ ఈ ఏడాది దసరా పండుగ కి భారీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15 వ తేదీన ఒక ప్రకటన చేయనున్నారు. మీడియా తో ఇటీవల ముచ్చటించిన మనోజ్ తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజుల క్రితం మంచు మనోజ్ తెలంగాణ రాష్ట్ర టూరిజం మంత్రి మరియు టూరిజం కార్పొరేషన్ అధికారులతో సమావేశమై కీలక చర్చ జరిపినట్లు తెలుస్తోంది. అయితే మంచు మనోజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాలంటే దసరా పండుగ వరకూ వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :