పవన్ అభిమానులను ఆకట్టుకున్న హీరో !

manoj1

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ అభిమానులు ఆ ట్వీట్ లకు లైకులు ఇస్తూ.. రీట్వీట్ లు, కామెంట్లు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఓ ట్వీట్ మాత్రం పవన్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షలను కూడా బాగా ఆకట్టుకుంది.

ఆ ట్వీట్ ఏమిటంటే మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వేడుకలు మీకు కాస్త ప్రత్యేకం. ఎందుకంటే, వచ్చే ఏడాది నుంచి మీరు రాజకీయ నాయకుడు కాబట్టి. వచ్చే ఎన్నికల్లో మీకంతా మంచే జరగాలి బిగ్ బ్రదర్. మీరు ఎల్లప్పుడూ మంచి విజయం, మరింత శక్తిని పొందాలి’ అని మనోజ్ పోస్ట్ చేశారు.

దాంతో మెగా అభిమానులు మనోజ్ కి అభినందనలు తెలుపుతున్నారు. మొన్న హరికృష్ణ అంత్యక్రియల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి, కళ్యాణ్ రామ్ కి అండగా నిలబడి నందమూరి అభిమానాలను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మనోజ్ పవన్ అభిమానులను కూడా ఆకట్టుకోవడం విశేషం.

Exit mobile version