మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ నవంబర్ నుండే.. !

మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ నవంబర్ నుండే.. !

Published on Oct 25, 2020 12:59 AM IST


మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ నవంబర్ 2 నుండి నుండి సిటీకి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌస్ లో మొదలుకానుందని తెలుస్తోంది. ముందుగా ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ కంపోజింగ్ లో భారీ ఫైట్ సీక్వెన్సెస్ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్. ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా మనోజ్ కి భారీ హిట్ వస్తోందేమో చూడాలి.

ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొత్తానికి కరోనా ప్రభావం ఇంకా ఉన్నప్పటికీ సినిమాల షూటింగ్స్ ను మొదలుపెట్టేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మనోజ్ కూడా చేరాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు