“మా” అధ్యక్షుడిగా మంచు విష్ణు అదిరిపోయే డిసీషన్..!

Published on Oct 23, 2021 2:07 am IST


మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా)కు ఇటీవల మంచు విష్ణు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు తాను చెప్పిన మేనిఫెస్టోను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయితే తాజాగా ‘మా’లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపాడు.

అయితే ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించాడు. విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌’ పేరిట కమిటీని ఏర్పాటు చేసినందుకు గర్వంగా ఉందని, ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని, మహిళా సాధికారత కోసం ఈ కమిటీ పనిచేస్తుందని అన్నాడు. అయితే త్వరలోనే కమిటీ మెంబర్లను మరియు పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :

More