ఇంటర్వ్యూ : ప్రగ్య జైస్వాల్ – మంచు విష్ణు క్రమశిక్షణ కలిగిన నటుడు !
Published on Apr 24, 2018 1:06 pm IST

మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వర్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ నెల 27వ తేదీన సినిమా విడుదలకానుంది. ఈ సందర్బంగా చిత్ర కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) ఇంతకీ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ‘ఆచారి అమెరికా యాత్ర’ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. విష్ణు, జి.నాగేశ్వర్ రెడ్డిల హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. కుటుంబం మొత్తం కలిసి హాయిగా చూడొచ్చు.

ప్ర) సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి ?
జ) నాది ఎన్నారై పాత్ర. అందంగా, కూల్ గా కనిపిస్తాను. నా పాత్రలో ఎక్కువ ఎమోషన్ ఉంటుంది.

ప్ర) అసలు సినిమా కథేంటి ?
జ) ఒక అకేషన్ కోసం నేను ఇండియా వస్తాను. అక్కడ నాకు, విష్ణుకి మధ్యన లవ్ స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ కోసం విష్ణు ఎలాంటి జర్నీ చేశాడు అనేదే సినిమా.

ప్ర) సినిమాలో హైలెట్ గా నిలిచే అంశం ?
జ) సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. విష్ణు, బ్రహ్మానందంగారి కాంబో నవ్వులు పూయిస్తుంది. అదే సినిమాకి పెద్ద హైలెట్.

ప్ర) సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది కదా… ఎలా జరిగింది ?
జ) మలేషియాలో ఒక బైక్ స్టంట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు బైక్ మీద విష్ణుతో పాటు నేను కూడ ఉన్నాను. ఇద్దరికీ దెబ్బలు తగిలాయి. అదృష్టవశాత్తు బయటపడ్డాం.

ప్ర) ఈ సినిమాలో నటించడం పట్ల మీ ఫీలింగ్ ?
జ) మొదటిసారి ఒక ఎంటర్టైనర్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా కొన్ని కొత్త విషయాల్ని నేర్చుకున్నాను.

ప్ర) మనోజ్ తో చేశారు, ఇప్పుడు విష్ణుతో చేశారు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ ?
జ) ఇద్దరూ బెస్ట్ హీరోలే. ఎవరికి వారు డిఫరెంట్. మనోజ్ ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో, సరదాగా జోకులు వేస్తూ ఉంటాడు. కానీ విష్ణుకి కొంచెం క్రమశిక్షణ ఎక్కువ. అన్నింటిలోనూ పర్ఫెక్ట్ గా ఉంటారు.

ప్ర) మీ కెరీర్ పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా ?
జ) ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నాను. మొదట ‘కంచె’ లాంటి పీరియాడిక్ ఫిల్మ్ చేసి ఆ తర్వాత ‘నక్షత్రం’ లో యాక్షన్ స్కోప్ ఉన్న పాత్రను ఇప్పుడు ఈ సినిమాలో ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఈ జర్నీ బాగుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook