కరోనా ఎఫెక్ట్.. మంచు విష్ణు వాళ్ళని బాగా మిస్సవుతున్నాడట

Published on Apr 1, 2020 6:42 pm IST

మంచు విష్ణు ఓ వీడియో సందేశం ద్వారా తన మనోవేదన తెలియజేశారు. ఆయన తన పిల్లలను ఎంతగానో మిస్సవుతున్నాని బాధపడ్డారు. కరోనా లాక్ డౌన్ కారణంగా తన పిల్లలు ఆరియానా, వివియానాలు తనకు దూరంగా విదేశాలలో ఉన్నారట. అనారోగ్యంగా ఉన్న ఓ బంధువును కలవడానికి వేరేదేశం మంచు విష్ణు ఫ్యామిలీతో పాటు వెళ్లారట. ఓ కార్యక్రమం కోసం విష్ణు మాత్రమే ఇండియా తిరిగిరాగా పిల్లలకు అక్కడే ఉండిపోయారట. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం జరిగింది. విష్ణు పిల్లలు అక్కడే ఉండిపోయారట.

దీనితో మంచు మనోజ్ పిల్లలపై దిగులు పెడ్డారట. అందుకే ఆయన గడ్డం పెంతున్నాడట. ఏప్రిల్ 14కి సాధారణ పరిస్థితులు ఏర్పడి పిల్లలను కలిసే అవకాశం రావాలని కోరుకున్నాడు. అలాగే కరోనా కర్ఫ్యూ పాటించండి, ఇంట్లో క్షేమంగా ఉండండి అని పిలుపునిచ్చారు. ఇక విష్ణు ప్రస్తుతం మోసగాళ్లు చిత్రంలో నటిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫరీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More