“మా” ఎన్నికలపై తన వ్యూతో మంచు విష్ణు ప్రెస్ నోట్.!

Published on Jun 27, 2021 12:36 pm IST

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ నాట “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్”(మా) ఎన్నికల పర్వం మంచి ఊపందుకున్న సంగతి తెలిసిందే. అలాగే మొన్ననే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి అధికారిక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ సెక్రటరీ పోస్ట్ కి గాను మొదటి నుంచి ప్రకాష్ రాజ్ తో పోటీలో మంచు వారి అబ్బాయి మంచు విష్ణు కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి తాను ఎందుకు ఈ మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను చేసి ఏం చెయ్యాలి అనుకుంటున్నారో అన్న దానిపై క్లుప్తంగా ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.

“తెలుగు ఇండస్ట్రీ లో పుట్టి ఇక్కడే పెరిగి చిన్ననాటి నుంచి మన పరిశ్రమ ఎదుర్కుంటున్న కష్టాలు శ్రమను చూసినవాడిని అని అందుకే తన వంతుగా సేవ చేసేందుకే మా అధ్యక్షతన పోటీ చెయ్యాలనుకుంటున్నాని తెలిపాడు. అలాగే మా నాన్నగారు ‘మా’ అసోసియేషనకు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, వారి నాయకత్వ లక్షణాలు కూడా నాకు మార్గదర్శకాలు అయ్యాయని తెలిపాడు..

అంతే కాకుండా గతంలో ‘మా’ అసోసియేషను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను పనిచేసినప్పుడు ‘మా’ బిల్డింగ్ ఫండ్ కి నా కుటుంబం తరుపున ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25% అందిస్తానని మాట ఇచ్చాను. బిల్డింగ్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేసాను. అవి ‘మా’ కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలుచేశాను.

‘మా’ అసోసియేషన్ వ్యవహారలన్నిటినీ అతి దగ్గరగా జాగ్రత్తగా పరిశీలించిన నాకు ‘మా’ కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. ‘మా’ సభ్యులలో కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా వుంటాము, అందుబాటులో ఉంటాము. ‘మా’ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా నా సేవలను సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను అని ప్రతి ఒక్కరి సహరాకారంతో తన ప్రయత్నం విజయవంతం కావాలని” కోరుతూ విష్ణు ధన్యవాదాలు తెలిపాడు.

సంబంధిత సమాచారం :