సినిమా చూసి కొంతమందైనా మారతారని ఆశిస్తున్న విష్ణు !

మంచు విష్ణు ప్రస్తుతం 9న ప్రేక్షకుల ముందుకురానున్న ‘గాయత్రి’ విడుదల పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఈయన చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదలకు సిద్దమవుతుండగా ‘ఓటర్’ చిత్రీకరణ దశలో ఉంది. గజ్జెల కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

సోషల్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం ‘ఓటు వేసేవాడు యజమాని, ఆ ఓట్లతో గెలిచినవాడు సేవకుడు’ అనే సందేశాన్ని చెబుతుందని, అది చూసి కొంతమందైనా మారతారనేది తన నమ్మకమని విష్ణు మీడియాతో అన్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా సురభి నటిస్తోంది.