‘ప్రకాష్ రాజ్’కి పోటీగా మంచి విష్ణు ?

Published on Jun 21, 2021 9:13 am IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు బరిలో దిగబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే (మా) అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ బరిలో దిగబోతున్నాను అని తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్‌ రాజ్‌ చెప్పుకొచ్చాడు. మరి ప్రకాశ్‌ రాజ్‌ కి పోటీగా మంచు విష్ణు బరిలోకి దిగితే ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారతాయి.

ఇక త్వ‌ర‌లోనే వీరిద్దరికి సంబంధించి ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ అయితే తానూ ఎందుకు మా ఎన్నికల్లో నిలబడుతున్నానో చెబుతూ ‘తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆ సమస్యలను అధిగమించడానికి నా దగ్గర సరైన ప్రణాళిక కూడా ఉంది. అసలు ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దది. దేశవ్యాప్తంగా ‘మా’కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు నా వంతు కృషి నేను చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :