చిల్డ్రన్స్ డే కానుకగా మంచు విష్ణు ‘ఎర్రబస్సు’

చిల్డ్రన్స్ డే కానుకగా మంచు విష్ణు ‘ఎర్రబస్సు’

Published on Sep 7, 2014 1:34 PM IST

Manchu-Vishnu
దర్శకరత్న దాసరి నారాయణరావు, మంచు విష్ణు కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎర్రబస్సు’. విష్ణు సరసన కేథరీన్ త్రేసా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో ఘన విజయం సాదించిన ‘మంజపై’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. దర్శకుడిగా దాసరి కెరీర్లో 151వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో దాసరి, విష్ణు తాత మనవళ్లుగా నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు తెలిపారు. పల్లెటూరి నుండి మనవడి కోసం సిటీకి వచ్చిన తాత ఎటువంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు అనే కధాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, అలీ, కృష్ణుడు, రఘుబాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు