సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ షూటింగ్ పూర్తయింది. తీరప్రాంతం, మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు మదిమారన్ పుగళేంది దర్శకుడు. సహజత్వం కోసం రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి ఈ మూవీ చిత్రీకరణను పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్కంఠభరితమైన యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు సెయిల్‌బోట్ రేస్ సన్నివేశాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాతో సుహాస్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకంతో ఏకంగా వంద రోజుల కాల్‌షీట్ కేటాయించిన ఆయన, పాత్ర కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు.
మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఇతర అప్‌డేట్స్ ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది.


