లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి , అరుణ్ విజయ్ , శింబు, విజయ్ సేతుపతి , ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘చెక్క చివంత వానం’. ఇటీవల విడుదలైన ఈచిత్రం అక్కడ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి మూడు రోజులకుగాను తమిళనాడులో రూ.21. 70కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈచిత్రం ఇక నిన్న ఆదివారం 8కోట్ల ను కలెక్ట్ చేసి 30కోట్ల క్లబ్ లో చేరింది. మణిరత్నం కెరీర్లో ఇవే బెస్ట్ ఓపెనింగ్స్ కావడం విశేషం. ఇకరేపు సెలవుదినం కావడంవల్ల ఈ రెండు రోజుల్లో ఈచిత్రం 50కోట్ల మార్క్ ను చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈచిత్రం తో మణిరత్నం మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
ఇక ఇది ఇలా ఉంటే తెలుగులో ఈ చిత్రం పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. ‘నవాబ్ ‘పేరుతో విడుదలైన ఈ చిత్రానికి మిక్సడ్ రివ్యూస్ రావడం అలాగే సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే వున్నాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎఆర్ రహెమాన్ సంగీతం అందించారు.


