ఏప్రిల్ 10న మణిరత్నం ‘ఒకే బంగారం’..?

ఏప్రిల్ 10న మణిరత్నం ‘ఒకే బంగారం’..?

Published on Mar 3, 2015 5:52 PM IST

ok-bangaram
‘సఖి’ తర్వాత మరోసారి మణిరత్నం నుండి వస్తున్న రొమాంటిక్ లవ్ స్టొరీ ‘ఓకే బంగారం’. ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ సినిమాలో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించారు. ఇటివల విడుదల ఈ సినిమా తమిళ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తమిళంలో ‘ఓకే కన్మణి’ పేరుతో తెరకెక్కించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ ‘ఓకే బంగారం’ను విడుదల చేస్తుంది. తమిళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను స్టూడియో గ్రీన్ సంస్థ సొంతం చేసుకుంది. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ‘ఒకే కన్మణి’ను నిర్మించారు. త్వరలో ఆడియో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు