చివరి దశ చిత్రీకరణలో మణిరత్నం ‘ఓకే కన్మణి’

చివరి దశ చిత్రీకరణలో మణిరత్నం ‘ఓకే కన్మణి’

Published on Nov 22, 2014 7:19 PM IST

mani-ratnam
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘ఓకే కన్మణి’. సినిమా ప్రారంభానికి ముందు చెప్పినట్టు ఈ సినిమా చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మణిరత్నం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. మలయాళ సూపర్‌ స్టార్ మమ్ముట్టి నట వారసుడు దుల్కర్ సల్మాన్ ‘ఓకే కన్మణి’ హీరోగా నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ సరసన నిత్యామీనన్ జంటగా నటిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత మణిరత్నం సినిమాలో ప్రకాష్‌రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మణిరత్నం మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు