చాన్నాళ్ల తర్వాత పూరి, మణిశర్మ కాంబో.. ఎలా ఉంటుందో

Published on Jun 7, 2019 2:00 am IST

ఇప్పుడంటే కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు మణిశర్మ హవానే వేరు. తన సంగీతంతోనే సినిమాల్ని సగం హిట్ చేయగల సత్తా ఉన్న టెక్నీషియన్. ఇప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలంటే మణిశర్మని మించిన వారు లేరు అనేలా ఉంటాయి ఆయన వర్క్స్. ఇక పూరి జగన్నాథ్ సినిమాలంటే మణిశర్మ కొంచెం ప్రత్యేకంగానే ఆకలోచిస్తారు. వీరి కలయికలో ‘పోకిరి, ఏక్ నిరంజన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్), చిరుత’ లాంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఉన్నాయి.

ఈ హిట్ కాంబినేషన్ చాన్నాళ్ల తర్వాత చేస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి తన మాస్ మాసాల స్టైల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత ఇస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన పాటల్లోని మొదటి పాట దిమాక్ ఖరాబ్ రేపు సాయంత్రం రిలీజ్ కానుంది. దీంతో అభిమానులంతా మణిశర్మలోని పాత ఊపు రేపటి పాటలో వినిపిస్తే బాగుండని కోరుకుంటున్నారు. చూడాలి మరి మణిశర్మ ఎలా అలరిస్తారో. ఇకపోతే రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 12న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More