50 దేశాల్లో విడుదలకానున్న మణికర్ణిక !

50 దేశాల్లో విడుదలకానున్న మణికర్ణిక !

Published on Jan 24, 2019 1:19 AM IST


బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న’మణికర్ణిక:ది క్వీన్ అఫ్ ఝాన్సీ చిత్రం విడుదలకు సిద్దమైంది. వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి , కంగనా దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ కు సినిమా ఫై అంచనాలను పెంచింది. ఇక ఈ చిత్రం హిందీ తో పాటు , తెలుగు , తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో జనవరి 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

అంకితా లోఖండే ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందించారు. భారీ బడ్జెట్ తో జీ స్టూడియోస్ , కమల్ జైన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బాహుబలి కి స్టోరీ ని అందించిన వి విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు