‘మణికర్ణిక’ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు !

Published on Sep 29, 2018 10:24 am IST

బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’. వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రం ఇటీవల పలు వివాదాల్లో నిలిచింది. కంగనా తో గొడవల కారణంగా ఈచిత్ర దర్శకుడు క్రిష్ , మరియు ఈ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ నటుడు సోనూసూద్ ఈచిత్రం నుండి మధ్యలోనే వైదొలిగారు. ఇక దాంతో కంగనా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతుంది. ఇక ఈచిత్రం యొక్క టీజర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు విడుదల కానుందని సమాచారం.

భారీ విఎఫ్ఎక్స్ తో రానున్న ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు స్వరాలు సమకూరుస్తున్నారు . జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :