మణికర్ణిక తెలుగు ట్రైలర్ విడుదలకానుంది !

Published on Jan 4, 2019 8:46 am IST

బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక:ది క్వీన్ అఫ్ ఝాన్సీ’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క హిందీ ట్రైలర్ ను గత ఏడాది డిసెంబర్18న విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క తెలుగు ట్రైలర్ ను ఈ రోజు విడుదలచేయనున్నారు. క్రిష్ జాగర్లమూడి , కంగనా రనౌత్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రం హిందీ తో పాటు , తెలుగు , తమిళ భాషల్లో జనవరి 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్నారు. జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ బయోపిక్ ఫై బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :