మేజర్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసిన మణిరత్నం

Published on Feb 27, 2021 2:10 am IST


స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి రచించిన నాలుగు నవలలాల్ సంకలనం ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది దర్శకులు ఈ నవలను సినిమాగా తీయాలని అనుకున్నా కుదరలేదు. ఎట్టకేలకు మణిరత్నం ఆ పని చేస్తున్నారు. లాక్ డౌన్ ముందు విదేశాల్లో షూటింగ్ జరిపారు. గత నెల జనవరి 6లో హైదరాబాద్లో భారీ షెడ్యూల్ ప్రారంభించారు.

నిరాటంకంగా నెల రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమై సెట్లో షూటింగ్ జరిపారు మణిరత్నం. ఈ పిరియాడికల్ డ్రామాలో విక్రమ్, అమితాబ్, ఐశ్వర్యరాయ్, కీర్తి సురేష్, త్రిష, నయనతార, విజయ్ సేతుపతి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయరామ్ లాంటి ప్రముఖ స్టార్లు నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ అందిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :