ఇంకొక 60 రోజులు చాలంటున్న మణిరత్నం

Published on Jun 16, 2021 11:02 pm IST

మ్యాజికల్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి రచించిన నాలుగు నవలల సంకలనం ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది దర్శకులు ఈ నవలను సినిమాగా తీయాలని అనుకున్నా కుదరలేదు. ఎట్టకేలకు మణిరత్నం ఆ పని చేస్తున్నారు. లాక్ డౌన్ మూలంగా చిత్రీకరణకు బ్రేకులు పడ్డాయి. విదేశాల్లో షూటింగ్ కావడంతో అస్సలు కుదరలేదు.

అయితే త్వరలో లాక్ డౌన్ ఎత్తివేస్తుండటంతో సన్నాహాలు చేసుకుంటున్నారు మణిరత్నం. ఇంకొక 50 నుండి 60 రోజులపాటు చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తైపోతుందట. థాయ్ లాండ్, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రియల్ లొకేషన్లలో చిత్రీకరణ చేయనున్నారట. హార్స్ రైడింగ్, ఛేజింగ్ సన్నివేశాలు ఎక్కువగా బ్యాలెన్స్ ఉన్నాయట. త్వరలో మొదలుకాబోయే షెడ్యూల్లో ముందుగా వాటినే తెరకెక్కిస్తారట. ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ అందిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, అమితాబ్, ఐశ్వర్యరాయ్, కీర్తి సురేష్, త్రిష, నయనతార, విజయ్ సేతుపతి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయరామ్ లాంటి ప్రముఖ స్టార్లు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :