మణిరత్నం “నవరస” వెబ్ సిరీస్ విడుదల తేదీ కి డేట్ ఫిక్స్!

Published on Jul 4, 2021 7:46 pm IST

మణిరత్నం ఆలోచనలో పుట్టుకొచ్చిన సరికొత్త ప్రయోగం నవరస. తొమ్మిది ఎపిసొడ్ లతో ఈ వెబ్ సిరీస్ ఉండనుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ను మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ తో కలిసి మద్రాస్ టాకీస్ క్యూబ్ సినిమా టెక్నాలజీస్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ తొమ్మిది ఎపిసొడ్స్ కూడా భారతీయ నవరసాలకు ప్రతీకగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ను మొత్తం తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కిస్తున్నారు. అందులో ప్రియదర్శన్, వసంత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బెజాయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజు, హలిత శమీం, కార్తిక్ నరేన్, అరవింద్ స్వామి, రతింద్రన్ ఆర్. ప్రసాద్ లు ఉన్నారు.

అయితే ఈ వెబ్ సిరీస్ లో సూర్య, రేవతి, సిద్ధార్ద్, పార్వతి తిరువోతు, పవెల్ నవగీతన్, రాజేష్ బాలచంద్రన్, శ్రీ రామ్, అమ్ము అభిరామి, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, విక్రమ్, ఐశ్వర్య రాజేష్, అరవింద్ స్వామి, ప్రసన్న తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉండగా, జూలై 6 వ తేదీన దీని పై ఒక కీలక ప్రకటన రానుంది. అధికారిక ప్రకటన మరియు విడుదల తేదీ పై ఒక క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :