“నవరస” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్..!

Published on Jul 26, 2021 8:30 pm IST

మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న అంథాలజీ చిత్రం నవరస. ఈ నవరస తొమ్మిది ఎపిసొడ్ లు గా రానున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 6 వ తేదీన ప్రముఖ ఆన్లైన్ వేదిక అయిన నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. జయేంద్ర పంచ పకేషన్ తో కలిసి మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ సినిమా టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో మొత్తం తొమ్మిది రసాలని చూపించే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు.

సౌత్ సినీ పరిశ్రమ కి చెందిన దర్శకులు, నటీనటులు ఈ చిత్రం కోసం పని చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు, పాటలు అభిమానులను, ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. అయితే నవరస టీమ్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. రేపు ఉదయం 9:09 గంటలకు ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :