మణిరత్నం మాస్టర్ పీస్ మళ్లీ మొదలుకానుంది

మణిరత్నం మాస్టర్ పీస్ మళ్లీ మొదలుకానుంది

Published on Dec 16, 2020 12:30 AM IST

mani

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లాక్ డౌన్ ముందు విదేశాల్లో షూటింగ్ జరిపారు. ఇక ఇండియా షెడ్యూల్ మొదలుపెట్టాలని అనుకుంటుండగా లాక్ డౌన్ విధించడంతో షూట్ కాస్త ఆగిపోయింది. లాక్ డౌన్ అనంతరం వెంటనే షూట్ మొదలుపెట్టాలని అనుకున్నా కూడ అందరు స్టార్లు బిజీగా ఉండటంతో వెంటనే రీస్టార్ట్ చేయడం కుదరలేదు.

ఎట్టకేలకు అందరి డేట్స్ కుదరడంతో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. జనవరి 10 నుండి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరగనుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ అందిస్తుండగా కళా దర్శకుడిగా తోట తరణి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, విక్రమ్, కార్తి, త్రిష, విజయ్ సేతుపతి, కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయరామ్ లాంటి ప్రముఖ స్టార్లు నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు