మణిశర్మ చేతుల మీదుగా మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ విడుదల

మణిశర్మ చేతుల మీదుగా మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ విడుదల

Published on May 18, 2025 7:30 AM IST

Vasudeva Sutam

ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఇస్తున్న చిత్రాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. గుడి చుట్టూ తిరిగే ఓ కథతో మాస్టర్ మహేంద్రన్ హీరోగా రాబోతోన్నాడు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల ‘వసుదేవ సుతం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజాగా ‘వసుదేవ సుతం’ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. గ్లింప్స్‌తోనే సినిమా మీద అంచనాల్ని పెంచేశారు.

ఈ గ్లింప్స్‌ని మణిశర్మ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ గ్లింప్స్‌కు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా అనిపిస్తుంది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు